Home  »  TV News  »  అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడను!

Updated : Oct 10, 2022

బుల్లితెర మీద గ్లామరస్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వైపు షోస్, ఈవెంట్స్ తో.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అను. లేటెస్ట్‌గా 'నిఖిల్‌తో నాటకాలు' షోకి వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు భార్యా భర్తలు. "ఇంటికి బాస్ ఎవరూ లేరు. ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటాం" అని చెప్పారు. సినిమా స్క్రిప్ట్స్, డేట్స్ వంటి వాటి విషయంలో ముందుగా భరద్వాజ్ విన్నాక అనసూయ వింటుందట‌. తాను ఓకే అంటేనే ముందుకు వెళ్తారట ఇద్దరూ. 

అలాగే "సోషల్ మీడియాలో అను పై వస్తున్న ట్రోలింగ్స్, మీమ్స్ ని అస్సలు పట్టించుకోను. ఒకవేళ తను అప్సెట్ గా కనిపిస్తే 'అవన్నీ చూడొద్దు' అని చెప్తాను" అన్నారు  భరద్వాజ్. "అలాగే కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి అనసూయ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఉన్నది ఒక్క లైఫ్. ఎలా కావాలంటే అలా ఉండడం ఇంపార్టెంట్. అందుకే అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడేది ఏమీ లేదు" అన్నారు అనసూయ భర్త. ఇంకా ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే "అనుకి పెళ్ళై పిల్లలు ఉన్నాక కూడా తనకు లవ్ ప్రపోజల్స్ చాలా వచ్చాయి" అంటూ నవ్వుతూ చెప్పారు భరద్వాజ్. 

ఇక ఈ షోలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అనసూయ భరద్వాజ్. "ఇప్పుడు ఎవరైతే మీమ్స్ చేసే వాళ్ళు, ట్రోల్ల్స్ చేసే వాళ్ళు వున్నారో.. వాళ్లకు కూసాలు కదిలేలా ఒక దెబ్బ తగలబోతోంది. దాని మీద నేను వర్క్ చేస్తున్నా. ఆ కాంపెయిన్ అందరికీ వర్తిస్తుంది" అంటూ ఒక బాంబు పేల్చారు. "నాకు విజయ్ సేతుపతి మీద క్రష్ ఉంది. అలాగే నేను ఫెమినిస్ట్ ని కాదు, యాక్టివిస్ట్‌ని. ఎక్కడ తప్పు జరిగినా ఖండిస్తాను" అని చెప్పింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.